తెలంగాణ ప్రభుత్వంపై నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై జీవన్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేనికి సంకేతం ఎవరితో కుమ్మక్కయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఎవరిని ఎదగనివ్వలేదని, కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు కట్టబెట్టి, ఇతర కులాలను తొక్కిపెట్టిన ఘనత జీవన్‌రెడ్డి అన్నారు బాజిరెడ్డి.


