24.2 C
Hyderabad
Wednesday, December 6, 2023
spot_img

Badruddin Ajmal : అత్యాచారం, దోపిడీ కేసుల్లో ముస్లింలు నంబర్ వన్…

స్వతంత్ర వెబ్ డెస్క్: అస్సాం ముస్లిం నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్(Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలలో నేరాల రేటు(Crime rate) ఎక్కువగా ఉందని అన్నారు. దోపిడీలు(Robberies), అత్యాచారాలు(rapes) వంటి నేరాల్లో ముస్లింలు నెం.1గా ఉన్నామని అజ్మల్ వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్లడంలో కూడా తామే నెంబర్ 1 అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

అస్సాంలోని గోల్పారా(Goalpara) జిల్లాలో అక్టోబర్ 20న జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి అజ్మల్ హాజరై మాట్లాడారు. ముస్లింలలో పెరుగుతున్న నేరాల రేటు(Crime rate)తో ముడిపడి ఉన్న సమాజంలోని విద్యాపరమైన లోపాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దోపిడీ, లూటీ, అత్యాచారం వంటి నేరాల్లో మనమే నెం.1గా ఉన్నాం. జైలుకు వెళ్లడంలో కూడా మనమే నెం.1. మన పిల్లలకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి సమయం దొరకదు. కానీ జూదం ఆడటానికి, ఇతరులను మోసం చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఇది విచారకరం.’’ అని అన్నారు.

అందరూ చంద్రుడు, సూర్యుడి వద్దకు వెళ్తున్నారని, కానీ జైలుకు ఎలా వెళ్లాలనే దానిపై మనం పీహెచ్ డీ చేస్తున్నామని చెప్పారు. ‘‘అబ్దుర్ రెహమాన్, అబ్దుర్ రహీం, అబ్దుల్ మజీద్, బద్రుద్దీన్, సిరాజుద్దీన్, ఫక్రుద్దీన్ ఇలా ఎవరు మెజారిటీలో ఉన్నారో పోలీస్ స్టేషన్(Police Station) లోకి వెళితే తెలుస్తుంది కదా. ముస్లిం యువతకు విద్య, ఉపాధి ప్రాముఖ్యతను తెలియజేయాలి’’ అని అజ్మల్ అన్నారు. 

అయితే బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, నేరాలకు పాల్పడే ధోరణికి.. విద్య లేకపోవడమే కారణమని ఆయన శుక్రవారం పునరుద్ఘాటించారు. ‘ఇండియా టీవీ’(India TV)తో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం(Muslim community)లో విద్య లేకపోవడం నేను చూశాను. మా పిల్లలు చదవడం లేదు. ఉన్నత చదువులకు వెళ్లడం లేదు. కనీసం మెట్రిక్యులేషన్(Matriculation) కూడా పూర్తి చేయటం లేదు. యువతకు విద్య ఆవశ్యకతను వివరించడానికే నేను అలా చెప్పాను’’ అని అన్నారు. 

 

పురుషులు మహిళలను చూసేటప్పుడు లేదా వారితో సంభాషించేటప్పుడు దురుద్దేశాలు కలగకూదని అన్నారు. మహిళలను చూసి లైంగికంగా ఉత్తేజితులవుతారని చెప్పే అబ్బాయిలకు, ఇస్లాం ప్రవర్తించడానికి తగిన మార్గం ఉందని చెబుతుందని తెలిపారు. ‘‘మార్కెట్ లో లేదా ఇతర ప్రదేశంలో మహిళలను చూసినప్పుడు మనం దూరంగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. మన కుటుంబాల్లో కూడా మహిళలున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి తల్లులు, సోదరీమణుల గురించి ఆలోచిస్తే, వారికి అనుచిత ఆలోచనలు రావు’’ అని బద్రుద్దీన్ అజ్మల్(Badruddin Ajmal) అన్నారు.

కాగా.. సుగంధ ద్రవ్యాల వ్యాపారి అయిన బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్(AIUDF) అస్సాంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలలో ఆధిపత్యం కలిగి ఉంది. 126 మంది సభ్యులున్న అస్సాంలో అసెంబ్లీలో ఏఐయూడీఎఫ్ కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బద్రీద్దీన్ అజ్మల్ కూడా 2009 నుంచి లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు. 

గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు

గతంలోనూ బద్రుద్దీన్ అజ్మల్(Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు కూడా ముస్లింల విధానాన్ని అనుసరించి యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవాలని అన్నారు. “ముస్లింలలో పురుషులు 20-22 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు. మహిళలు కూడా మేజర్ కాగానే 18 ఏళ్లకు వివాహం చేసుకుంటారు. హిందువులు మాత్రం పెళ్లికి ముందే ఇద్దరి ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్లు పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. విలాసంగా గడుపుతారు. డబ్బు దాచుకుంటారు” అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్స్ అక్కడితో ఆగలేదు. “హిందువులు 40 ఏళ్లు దాటాక తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకుంటారు. ఆ వయసులో పిల్లల్ని కని ఎలా పెంచగలరు..?” అని అన్నారు. కాస్త అభ్యంతరకరంగానూ మాట్లాడారు. దీనిపై హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు మరోసారి ముస్లిలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Tags

Latest Articles

థియేటర్ నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు: నితిన్

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్