జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ – 2024 ఈవెంట్ హైదరాబాద్ హరిహర కళాభవన్‌లో ఘనంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన పలువురికి ఆయా కేటగిటిలలో అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్లో బింబిసార మూవీకి బెస్ట్ డైరెక్టర్‌గా వశిష్టకు, RRR లోని నాటు నాటు పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు, నటుడు మాణిక్‌కి, కమెడియన్‌గా రచ్చ రవికి, బెస్ట్ సపోర్టింగ్ రోల్‌గా డీజే టిల్లులో మురళీ ధర్ గౌడ్‌కి, మా ఊరి సినిమాకు గాను ఉత్తమ నటీమణిగా నేహా రెడ్డికి, పుష్పలో బెస్ట్ విలన్‌గా అజయ్ ఘోష్‌కి, వీరితో పాటు మరిన్ని కేటగిరీలలో పలువురికి జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ అందిం చారు. టాలీవుడ్‌లో ఇప్పటికే రెండు సార్లు జోష్ టాలెంట్ అవార్డ్స్ ఇచ్చామని సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ తెలిపారు. ఇప్పుడు మూడో సారి ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ వేడుక జరిగిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులకు ఆయన ధన్య వాదాలు తెలిపారు. ఇకపై కూడా ప్రతి ఏడాది ఈ అవార్డ్స్‌ను తమ సంస్థ నుంచి అందిస్తామని సంజోష్ తెలిపారు.


