స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8 నిందితుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు అవినాశ్‌ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగనుంది. వివేకా హత్య జరిగిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలపై ఆయనను అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది. కాగా అవినాశ్‌కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ప్రతి శనివారం విచారణకు హాజరుకావాలని షరతు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత శనివారం కూడా అవినాశ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. మరోవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డి సవాల్ చేసిన ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.