ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఢిల్లీ మహిళా కమిషన్ లోని 223 మంది ఉద్యోగులపై వేటు వేశారు. వీరంతా అక్రమంగా నియమితులయ్యారనే సాకుతో తక్షణం ఉద్యోగాలనుంచి తొలగించారు. నిబంధ నలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ వీరిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది. వీరి నియా మకాలు సక్రమంగా జరగలేదని, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని ఉత్తర్వులో పేర్కొ న్నారు. ఢిల్లీ మహిళాకమిషన్ ఎలాంటి అనుమతులు లేకుండా మార్గదర్శకాలను ఉల్లంఘించి, సిబ్బంది జీతాలు, అలవెన్స్ లను పెంచిందని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


