స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. మాచిరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాతో యువకుడి గొంతుకోసి హత్య చేసి చంపేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన యువకుడికి గత రాత్రి మద్యం తాగించి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువకుడు జహీరాబాద్‌లోని ఆర్యనగర్‌కు చెందిన శ్రీకాంత్(30)గా గుర్తించారు. అయితే ఈ హత్య ఘటనతో సంబంధమున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని విచారిస్తున్నారు.