Murder | రోజురోజకి దారుణాలు ఎక్కవవుతున్నాయి. తాజగా మరో దారుణం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా మొగిల్‌రావులచెరువులో భర్త దేవరాజ్‌ను గొడ్డలితో నరికి చంపింది భార్య అలివేలు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అలివేలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొగిల్‌రావులచెరువులో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.