స్వతంత్ర వెబ్ డెస్క్: సంచలనం సృష్టించిన మీర్ పేట్(Meerpet) మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం(Gang rape) కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. ఓ నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడ్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ముగ్గురు నిందితులు బాలికపై అత్యాచారం చేయగా, మరో నలుగురు బయట కాపలాగా ఉన్నారని వెల్లడించారు.
బాలిక ప్రతిఘటించే ప్రయత్నం చేయగా నిందితులు ఆమెపై దాడి చేశారు. నిందితులపై ఐపిసి సెక్షన్లు 1211/2023 U/s 452, 324, 376-డిఎ, 506, పోక్సో యాక్ట్ 5(జి)ఆర్/డబ్లూ 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎల్బీనగర్ డిసిసి సాయిశ్రీ, ఎస్వోటీ డిసిపి 1 గిరిధర్‌లతో కలిసి రాచకొండ సిపి చౌహాన్ మంగళవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని లాల్ బజార్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. రెండు వారాల కిందట సోదరుడు (14)తో కలిసి మీర్ పేటలోని నందనవనం కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర వీరు ఉంటున్నారు. బాధితురాలు దిల్ సుఖ్ నగర్‌లోని ఓ క్లాత్ స్టోర్‌లో పనిచేస్తోంది. బాలుడు ఫ్లెక్సీల పని చేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొందరు నిందితులు వీరి ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే వీరు గంజాయి మత్తులో ఉన్నారు. నలుగురు నిందితులు బాలిక మెడపై కత్తి పెట్టారు.
బిల్డింగ్ లోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లి ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తమ్ముడితో పాటు మిగతా చిన్నారుల్ని మిగతా నిందితులు అదే గదిలో బంధించారు. నిందితుల్లో ముగ్గురు కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడినుంచి వెళ్లిపోగా, బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.