స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ నూతన సచివాలయ భవనానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ శుక్రవారం వచ్చారు. ఈ ఆలయంలో కొత్తగా నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఉప్పు, నిప్పుగా ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందుకోసం ముందుగానే సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తర్వాత వచ్చిన గవర్నర్ తమిళిసైకు సాదర స్వాగతం పలికారు. ఆమెతో కలిసి సీఎం కేసీఆర్ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి, మసీదులను కూడా ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.