38.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

IND vs PAK: ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. కొండెక్కిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధర

స్వతంత్ర వెబ్ డెస్క్: వన్డే ప్రపంచకప్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ టికెట్ కోసం తెగపోటీ నెలకొంది. ఒక టికెట్ ధర రూ.57 లక్షలకు చేరిందంటే అభిమానుల్లో క్రేజీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వన్డే ప్రపంచకప్ 2023కు సంబంధించి అన్ని వార్మప్, లీగ్ దశ మ్యాచ్ టికెట్ల విక్రయాలు సెప్టెంబర్ 3న ముగిశాయి. ఆగస్ట్ 25 నుంచి 29వ తేదీ వరకు మాస్టర్ కార్డ్ యూజర్లకు మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత ఆగస్ట్ 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 వరకు టికెట్లను బుక్ మై షో ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీంతో సెకండరీ మార్కెట్లో క్రికెట్ మ్యాచ్ ల టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. లైవ్ మ్యాచ్ ల సెకండరీ టికెట్ల విక్రయ వేదిక ‘వైగోగో’లో టికెట్ల ధరలు భారీ స్థాయికి చేరాయి. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల ధర రూ.41,118 నుంచి రూ.1.67 లక్షల మధ్య పలుకుతోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల ధరలు కనిష్టంగా రూ.57,198 పలుకుతుంటే, గరిష్ట ధర రూ.57.15 లక్షలకు చేరింది. ఈ ధరలు చూసి క్రికెట్ అభిమానులు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 టికెట్లకు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ ఏర్పడినట్టు విమర్శలు వస్తున్నాయి.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్