భర్తపై దాడితో ఓ మహిళ రెచ్చిపోయింది. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ మధుర వైన్స్‌లో రమేష్ అనే వ్యక్తి మద్యం కొనేందుకు వెళ్లాడు. పేమెంట్ విషయంలో మాటమాట పెరగడంతో వైన్ షాపు సిబ్బంది అతని తల పగలగొట్టారు. భర్తను రక్తంతో చూడడంతో భార్య రెచ్చిపోయింది. దీంతో మరో కొంత మంది తో వచ్చి వైన్ షాపు సిబ్బందిపై దాడి చేసింది. షాపులో జొరబడి మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకొని కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు వైన్ షాపు సిబ్బందిపై, మహిళ మీద వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు.


