స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి 60ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అసోంకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువాను ఆయన గురువారం రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. కోల్కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్ వ్యాపారంలో రూపాలికి భాగస్వామి అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కొంతకాలం మొదలైన స్నేహం ప్రేమగా మారింది. రుపాలీని పెళ్లి చేసుకోవడం ఓ అద్భుతమైన ఫీలింగ్ అంటూ ఆశిష్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా ఆశిష్ విద్యార్థికి రెండు సుమారు 20ఏళ్ల క్రితం నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. తెలుగులో ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ ఇటీవల తెలుగులో రైటర్ పద్మభూషణ్ చిత్రంలో నటించారు.