పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని వారించిన రామకృష్ణారెడ్డి… కుటుంబాన్ని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తాను రాజకీయంగా మోసపోయా నన్నారు. అధిష్టానం ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకుని అనంతరం భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.


