ముంబై ఇండియన్స్ తో శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 16పరుగులు కావాల్సి ఉండగా.. పంజాబ్ బౌలర్ అర్ష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే రెండు వికెట్లు తీశాడు. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ స్టంప్స్ విరిగిపోయాయి. దీంతో బీసీసీఐకి రూ.80లక్షలు నష్టం వచ్చింది. ఈ ఐపీఎల్‌లో జింగ్ బెయిల్స్(Zing bails) స్టంప్స్‌ను వాడుతున్నారు.
ఎల్‌ఈడీ బల్బులు, కెమెరా, జింగ్ బెయిల్స్ ఈ స్టంప్స్‌లో ఉంటాయి. ఒక స్టంప్ దెబ్బతిన్నా.. సెట్ మొత్తాన్ని మార్చాలి. దీంతో రెండుసార్లు స్టంప్స్‌ను మార్చాల్సి వచ్చింది. ఒక్కో స్టంప్ సెట్ ఖరీదు దాదాపు రూ.30-40 లక్షల మధ్య ఉంటుందట. దీంతో రెండు స్టంప్స్ విరగడంతో దాదాపు రూ.60-80లక్షల వరకు బీసీసీఐకి నష్టం వాటిల్లింది. కాగా ఈ మ్యాచులో రెండు వికెట్లు తీసిన అర్ష్ దీప్ మొత్తం 13వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
Stump breaker,
Game changer!Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
— JioCinema (@JioCinema) April 22, 2023