29.2 C
Hyderabad
Sunday, June 15, 2025
spot_img

ఈ వయస్సులో చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం- హరీష్ రావు

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై  తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. ఈ వయస్సులో  ఆయనను అరెస్ట్ చేయడం మంచిది కాదన్నారు.

చంద్రబాబు తెలంగాణ సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారన్నారు హరీశ్ రావు. ఆనాడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే ..తెలంగాణలో పదెకరాలు వచ్చేదని.. కానీ ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే  వంద ఎకరాలు వస్తదని చంద్రబాబు మెచ్చుకున్నారని తెలిపారు. కేసీఆర్  పాలన మంచిగుంది కాబట్టే చంద్రబాబు అలా మెచ్చుకున్నారన్నారు.  కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం లేదన్నారు. కేసీఆర్ తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచారని తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. వారికి మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూా మద్దతు తెలిపారు.మంత్రి మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  ఎమ్మెల్యే షకీల్ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.  తెలంగాణలో ఐటీ ఉద్యోగులు, సెటిలర్ల ఓట్లను ఆకట్టుకునేందుకే హరీశ్ రావు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించినట్లుగా ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్