ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత మొదటి సారి ఆయన ఏపీకి వస్తున్నారు. ఏపీలో నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో ఆయన పర్యటించను న్నారు. అదే రోజున చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించ నున్నారు.
ఈ ఉమ్మడి సభలో మూడు పార్టీల నేతలు పాల్గొంటారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకే వేదికపైకి మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది. ఇక ఎన్నికల ప్రచార బరిలోకి దిగాయి మూడు పార్టీలు. మరోవైపు చిలకలూరి పేట బొప్పూడి దగ్గర నిర్వహించ నున్న బహిరంగ సభా స్థలిని టీడీపీ నేతలు పరిశీలించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టిడిపి, జనసేన, బీజేపి ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలిం చారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. సభా ప్రాంగంణం వద్ద భూమి పూజ నిర్వహించారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి మూడు పార్టీలు. ప్రధాని మోదీ పాల్గొనే సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు నారా లోకేష్.