ఏపీలో రెండో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తమకు రావాలసిన పాత బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని ప్రైవేట్ ఆస్పత్రులు పట్టుబట్టడంతో సేవలకు రెండో రోజు కూడా బ్రేక్ పడింది. అయితే, అత్యవరసరంగా 203 కోట్ల రూపాయల నిధులను ఏపీ సర్కార్ విడుదల చేసినప్పటికీ పూర్తిగా బకాయిలు చెల్లిస్తేనే సేవలు అందిస్తామని తేల్చి చెబుతున్నాయి ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలతో ఆరోగ్యశ్రీ సీఈవో రెండుసార్లు చర్చలు జరిపినప్పటికీ అవి సఫలంకాలేదు. దీంతో మరోసారి చర్చలు జరిపే అవకాశముంది. మరోపక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఈవో. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు.


