28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

చట్టసభల్లో ఏరీ సగం?

    మహిళా సాధికారత లక్ష్యంగా అన్నిపార్టీలు సందేశాలను ప్రకటిస్తాయి. దేశంలో పురుష ఓటర్లతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నా, చట్టసభల్లో మెజారిటీ పురుషులదే. మహిళా ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. చట్టసభల్లో 33 శాతం సీట్లు రిజర్వేషన్ చేయాలనే చట్టాన్ని దాదాపు 27 ఏళ్ల పోరాటం తర్వాత పార్లమెంటు ఆమోదించింది. ఇంకా అమల్లోకి రాలేదు. అమలులోకి వచ్చిన తర్వాత అయినా పార్లమెంటులోనూ, అసెంబ్లీలలోనూ మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందా.!

ఆకాశంలో సగం. అవనిలో సగం అనే నినాదం. చట్టసభల్లో ఒట్టి నినాదంగా మిగిలింది. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల్లో మహిళల్లో అక్షరాస్యత పెరిగింది. కానీ, చట్టసభల్లో మహిళల సంఖ్య రెండంకెలు దాటలేదు. 31 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేవలం 13 రాష్ట్రాల్లోనే మహిళలు ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. అదీ ఒకటి, రెండు సందర్భాల్లోనే. ఓటర్లలో మహిళలు ప్రభుత్వా లను మార్చే స్థాయిలో సంఖ్యా బలం ఉన్నా.. మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య జనాభా స్థాయిలో పెరగ లేదు. మహిళా ఎంపీలు అంటే. సోనియాగాంధీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, మహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, కనిమొళి, మహువా మొయిత్రా, లాకెట్ చటర్జీ వంటి పట్టుమని 25 పేర్లు కూడా గుర్తుకు రావు.

  గత లోక సభ ఎన్నికల్లో అంటే 1957లో 45 మంది మహిళలు పోటీ చేశారు. 2019 నాటికి పోటీ పడే మహిళా అభ్యర్థుల సంఖ్య 726కు పెరిగింది. పార్లమెంటులో మహిళల శాతం 1957లో 4.5 శాతం ఉండగా, 2019 నాటికి అది 14.4 శాతానికి మాత్రమే పెరిగింది. 1957 లో 1,474 మంది పురుషులు పోటీ చేస్తే 2019 లో పోటీ చేసేవారి సంఖ్య 7,322 కు పెరిగింది. ఈ 62 ఏళ్ల కాలంలో పార్లమెంటులో మహిళా ప్రతినిధుల సంఖ్య 15శాతం దాటలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 8,054 మంది అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో మహిళలు 726 మందే. 2014లో మొత్తం 8,251 మంది అభ్యర్థుల్లో మహిళలు 668 మంది. అంటే కేవలం 9 శాతం లోపు మహిళలకే పోటీపడే అవకాశం దక్కింది. వారిలో మూడోవంతు మహిళలకు ఏ రాజకీయపార్టీ మద్దతు ఇవ్వలేదు.

  దేశంలోని ఓటర్లలో సగం మంది మహిళలే. ఉత్తర భారతంలో గత 15 ఏళ్లలో జనాభాలో మహిళల మరింత పెరిగింది. 1962లో మహిళా ఓటర్లు 42 శాతం ఉంటే. 2018 నాటికి వీరి 48. 2 శాతానికి పెరిగింది. 11 రాష్ట్రాలలో మహిళా ఓటర్లు పురుష ఓటర్లను మించి ఉన్నారు. మహిళా ఓటర్లు పెరిగారు తప్ప.. మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగలేదు. 2019లో మొత్తం 543 మంది ఎంపీలలో మహిళా ప్రతినిధులు 14.4 శాతం మించలేదు. ఇక అసెంబ్లీలలో మహిళా ప్రాతినిధ్యం గత 30 ఏళ్లలోనూ 12 శాతాన్ని మించలేదు. ఈ 75 ఏళ్లలో తొలిసారిగా 2019లో మాత్రమే 78 మంది మహిళా ఎంపీలు ఎన్నిక య్యారు. అదే రికార్డు.

భారత ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కాగా, ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ. తర్వాత90వ దశకంలో మాయావతి మళ్లీ సీఎం అయ్యారు. తమిళనాట జానకీ రామచంద్రన్, జె. జయలలిత సీఎం బాధ్యతలు చేపట్టారు. ఒడిశాలో నందినీ శథపతి సీఎం అయ్యారు. ఢిల్లీ తొలి మహిళా సీఎంగా సుష్మా స్వరాజ్ 52 రోజులు పాలిస్తే.. షీలా దీక్షిత్ 1998 నుంచి ఏకంగా 15 ఏళ్లు సీఎంగా చేశారు. అంత సుదీర్ఘ కాలం సీఎంచేసింది షీలా దీక్షితే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడు టర్మ్ ల నుంచి ఏలుతున్నారు. బీహార్ లో రబ్రిదేవి, గోవాలో శశికళా కాకోద్కర్, రాజస్థాన్ లో వసుంధరా రాజే,మధ్యప్రదేశ్ సీఎంగా ఉమాభారతి, గుజరాత్ సీఎంగా ఆనంది బెన్ పాటిల్, జమ్మూకశ్మీర్ సిఎంగా మహబూబా ముఫ్తీ పనిచేశారు.

మనదేశంలోని అన్నిరాజకీయ పార్టీలు పురుషాధిక్యత పార్టీలే. మహిళలకు పార్టీ టికెట్ అరకొరగా వడ్డించే వారే. మహిళా రిజర్వేషన్ చట్టం చేసిన క్రెడిట్ ఆపాదించుకుంటున్న 2024 లోక్ సభ ఎన్నికల్లో 417 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే.. వారిలో మహిళలు 68 మందే. అంటే 16శాతం దాటలేదు. 1996 – 2019 మధ్య వివిధ పార్టీలు టికెట్ ఇచ్చిన మహిళల శాతం స్వల్పంగా పెరిగింది. కాంగ్రెస్ 1996లో 9.3 శాతం టికెట్లు ఇస్తే 2019లో 12.8 శాతానికి మించలేదు. అదే సీపీఐ 1996లో 7శాతం , 2019లో 8.2 మందికి, సీపీఎం 1996లో 6.7 శాతం మంది మహిళలకు టికెట్ ఇస్తే, 14.5శాతానికి పెరిగింది. ఏమైనా ఏ రాజకీయ పార్టీ పట్టుమని 20శాతం టికెట్లు కూడా మహిళలకు కేటాయించలేదు. చట్టసభల్లో 33 శాతం మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తే.. తప్ప ఈ పార్టీల ధోరణి మారదేమో.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్