స్వతంత్ర, వెబ్ డెస్క్: మూగబోయిన గొంతులన్ని స్వరాలు సరిచేసుకుంటున్నాయి. ముసలోళ్లు అయినోళ్లంతా ఈ మధ్య బయటకు వచ్చి కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నారంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ప్రజల నుంచి తిరస్కారానికి గురైన నల్లగొండ నేతలు కూడా గొంతు పెద్దగా చేసుకుని ఏడుస్తున్నారని అన్నారు. పార్టీలో పెత్తనం కోసం ఒకాయన పాదయాత్ర చేస్తున్నారు.. జిల్లా నేతలు ఆయన పక్కన నిల్చోని గొంతు విప్పుతున్నారని అన్నారు. వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని.. మీరు చేసిన నేరాలకు ఢిల్లీ వరకు ముక్కు నేలకు రాయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగొండను నాశనం చేసి నడ్డి విరిచారు. మీ పాలనలో నల్లగొండ ప్రజల ఎముకలు గూళ్లుగా మారాయి. అడ్డగోలుగా మాట్లాడటానికి సిగ్గుండాలి. ఫ్లోరోసిస్ ను పెంచి పోషించింది మీరు కాదా? అంటూ మండిపడ్డారు. ఊర్లలో జనాలు బుద్ధి చెప్పాడానకి సిద్ధంగా ఉన్నారు. ఫ్లోరోసిస్ పై కాంగ్రెస్ నేతలు ఒకనాడన్నా మాట్లాడారా? మిషన్ భగీరథ ఇంటింటికీ ఇచ్చి ఫ్లోరోసిస్ ను పారద్రోలింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. నా ఎత్తు గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేస్తున్నారు. రావణాసురుడుకి పద తలలు ఉంటే ఉపయోగం ఏంటి..అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.