Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయా ?

బీఆర్‌ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ ఆశలు చివరకు అడియాసలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. దాదాపు 14 ఏళ్ల పాటు ఉద్యమం నడిచింది. ఆ తరువాత 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2022లో టీఆర్‌ఎస్ ను జాతీయ పార్టీ చేశారు కేసీఆర్. భారత్ రాష్ట్ర సమితి అంటూ పేరు మార్చారు. మహారాష్ట్ర, బీహార్‌, ఝార్కండ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక వేదిక ఏర్పాటుకు కృషి చేశారు. ఇదిలా ఉంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. గులాబీ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అవుతోంది.

పూర్వాశ్రమంలో భారత్ రాష్ట్ర సమితి పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. ఇదే పేరుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించింది అప్పటి టీఆర్‌ఎస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారు కేసీఆర్‌. రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణను సాధిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఒక్క నెత్తుటి బొట్టు చిందించకుండా అది మొదలు తన వాగ్ధాటి, రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతూ మలిదశ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన మూడేళ్లకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని.. 26 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో కరీంనగర్ బహిరంగ సభకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ ఇస్తామని యూపీఏ చైర్ పర్సన్ హోదాలో సోనియా గాంధీ ప్రకటించడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని యుపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో చేర్చడంలో విజయం సాధించారు కేసీఆర్. ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 36 పార్టీలతో లేఖలు ఇప్పించడంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2009 అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో కేసీఆర్ భారీ సభ నిర్వహించారు. 2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనను, తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా చెప్పుకోవాలి.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ను అరెస్టు చేశారు. ఖమ్మం జైలుకు తరలించారు. అయితే ఖమ్మం జైల్లోనూ దీక్ష కొనసాగించారు కేసీఆర్. ఆ తరువాత నిమ్స్ కు తరలిస్తే అక్కడా కూడా దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో అనే నినాదం మార్మోగింది. తెలంగాణ భగ్గుమనడంతో కేంద్రం కదిలింది. 2003 డిసెంబరు 9వ తేదీన తెలంగాణకు అనుకూలంగా పార్లమెంటులో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. అయితే డిసెంబర్‌ ఆరు నాటి చిదంబరం ప్రకటన తరువాత ఆంధ్రప్రాంతంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. సమైక్యాంధ్రకు అనుకూలంగా నాయకులు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. అలాగే విభజన ప్రతిపాదనకు వ్యతిరేకగా ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో డిసెంబరు 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు చిదంబరం ప్రకటించారు. ఆ తరువాత తెలంగాణ భగ్గున మండింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె.. ఒక్కటేమిటి.. ఇలా ఎన్నెన్నో ఆందోళనల్లో తెలంగాణ సమాజం పాల్గొంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. చివరగా 2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ తేదీగా ప్రకటించింది.

         జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2022 సెప్టెంబర్‌లో భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టారు. అయితే ఇది కొత్తగా పెట్టిన పార్టీ కాదు. అప్పటివరకు కేవలం తెలంగాణకే పరిమితమైన తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చారు కేసీఆర్. అలా తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారింది. బీఆర్‌ఎస్ అధినేతగా మహారాష్ట్ర, బీహార్‌, ఝార్కండ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కేసీఆర్‌ పర్యటించారు.థర్డ్ ఫ్రంట్ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఒక వేదిక ఏర్పాటు చేయడానికి కసరత్తు చేశారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే లాంటి హేమాహేమీలతో సంప్రదింపులు జరిపారు. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించిన కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయి.జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం సంగతి పక్కన పెడితే తెలంగాణాలోనే బీఆర్ఎస్‌కు కష్టకాలమొచ్చింది. పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ ఇమేజ్ దెబ్బతింది. నిన్న మొన్నటివరకు వీరుడు,శూరుడు అని పొగడ్తల వర్షం కురిపించిన అనుచరులు పార్టీని వీడటం మొదలెట్టారు. ఒక్కొక్కరుగా పార్టీ నేతలందరూ గుడ్‌బైలు కొడుతున్నారు. మొత్తానికి గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్