39.2 C
Hyderabad
Monday, April 15, 2024
spot_img

పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీని వీడుతున్నారా?

   తెలంగాణలో కారు పంక్చర్ అయింది. గులాబీ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అవుతోంది. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీకి గుడ్‌బై చెబుతారో తెలియని దయనీయమైన పరిస్థితి నెలకొంది. వలసలను ఆపడానికి గులాబీ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలితాలనివ్వడం లేదు. దీంతో కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ విడిచి పెట్టిపోవడం దారుణ మంటున్నారు గులాబీ పార్టీ పెద్దలు. వలసబాట పడుతున్న నేతలకు పార్టీ పట్ల కమిట్‌ మెంట్ లేదంటూ మండిపడు తున్నారు. అయితే బీఆర్‌ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు వలసబాట పడుతున్న నేతలు. ఇదంతా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటూ కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. ఈ పదేళ్లకాలంలో ఎంతమంది ఇతర పార్టీ ఎమ్మెల్యే లను కేసీఆర్ బీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చారో అంకెలతో సహా వివరిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఫిరాయింపులు జరగలేదా అంటూ నిలదీసి ప్రశ్నిస్తున్నారు.

      ఒకవైపు వలసలతో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. వలసబాట పట్టిన నేతలపై గులాబీ పార్టీ పెద్దలు మండిప డుతున్నారు. వలసలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.రాజకీయ అవకాశ వాదులు, పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీని వీడుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. నేతలు పార్టీ వీడటం భారత్ రాష్ట్ర సమితికి కొత్తకాద న్నారు హరీశ్ రావు. వాస్తవానికి కేసీఆర్, తెలంగాణ ఉద్యమం ప్రారంభించి నప్పుడు ఆయన వెంట తక్కువ మంది మాత్రమే ఉన్నారన్నారు. అయినప్పటికీ తెలంగాణ సమాజం ఆశీర్వా దంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించి చూపించారన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనవచ్చు కానీ, ఉద్యమకారులను కొనలేదన్నారు హరీశ్‌ రావు. బీఆర్‌ఎస్‌లో మొదట్నుంచి ఉన్నవారు అలాగే పార్టీలో కొన సాగుతున్నారన్నారు. కేవలం మధ్యలోకి పార్టీలోకి వచ్చిన వారు మాత్రమే ఇప్పుడు గుడ్‌ బై అంటు న్నారని దుయ్యబట్టారు. అయితే కష్టకాలంలో గుడ్‌బై కొట్టినవారిని మళ్లీ పార్టీలోకి తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు హరీశ్ రావు.

      ఇతర పార్టీల్లోకి వెళుతున్న నేతలపై గులాబీ పార్టీ పెద్దలు మండిపడుతున్నారు. వెళ్లిపోతున్న నేతలకు పార్టీ పట్ల ఎటువంటి కమిట్మెంట్ లేదన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండాల్సిన నాయకులు, స్వంత ప్రయోజనాలు చూసుకుని పార్టీ వీడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది నాయకులు వెళ్లి పోయినంత మాత్రాన భారత్ రాష్ట్ర సమితి నష్టపోయేది ఏమీ లేదంటూ కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేవలం ఒక స్పీడ్‌ బ్రేకర్ గానే తాము చూస్తున్నామంటున్నారు గులాబీ పార్టీ నేతలు. క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి కార్యకర్తల బలం ఉందన్నారు. ఉద్యమ పార్టీ అయితే భారత్ రాష్ట్ర సమితి ఇటువంటి అవరోధాలు ఎన్నిటినో చూసిందన్నారు. గుప్పెడు మంది నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన గులాబీ పార్టీ బలహీన పడటం జరగదన్నారు. కొంతమంది నాయకులు వెళ్లిపోతే పార్టీకి కొత్త నాయకులు వస్తారంటూ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు.

ఒకవైపు బీఆర్‌ఎస్ ఖాళీ అవుతోంది.మరోవైపు గులాబీ పార్టీ పెద్దలకు ప్రజల నుంచి అలాగే ప్రజా సంఘాల నుంచి కనీన సానుభూతి కరువవుతోంది. దీనికి కారణం కేసీఆర్ హయాంలో విచ్చలవిడిగా జరిగిన ఫిరాయిపులే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్‌ఎస్‌ నుంచి వలసల నేపథ్యంలో గతంలో జరిగినదానిని తవ్వి తీస్తున్నారు కేసీఆర్ వ్యతిరేకులు. తెలంగాణలో రాజకీయ వలసలకు ఆద్యుడు గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావే అంటూ ఎదురు దాడి చేస్తున్నారు జంపింగ్ జపాంగ్‌లు. రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు వివిధ సందర్బాల్లో కాంగ్రెస్ , టీడీపీ నుంచి క్షేత్రస్థాయి మొదలుకుని బడా నాయకుల వరకు భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. వలస నేతల జాబితాలో చిన్నా చితకా నాయకులు కాదు. మంత్రులుగా పనిచేసిన వారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతో పాటు వివిధ స్థాయి నేతలు కూడా ఉన్నారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు కేసీఆర్. దీంతో ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి రాజకీయ వలసలు జోరందుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇతర పార్టీ నేతలను సాక్షాత్తూ కేసీఆర్ యే ప్రలోభ పెట్టారన్న విమర్శలున్నాయి. ఇలా ఇతర పార్టీల నుంచి  బీఆర్‌ఎస్‌లోకి చేరినవారికి, మొదట్నుంచీ పార్టీలో ఉన్నవారికి మధ్య అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటాలు కూడా జరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత వివిధ పార్టీల నుంచి 14 మంది శాసన సభ్యులు గులాబీ పార్టీలోకి చేరారు. కిందటి శాసనసభలో గులాబీ పార్టీకి 103 మంది శాసనసభ్యులు ఉండేవారు. వీరిలో 40 శాతం మంది అంటే 42 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారే. వీరంతా 2014 తరువాత గులాబీ గూటికి చేరిన వారే కావడం విశేషం. అంతకుముందు కిందటిసారి కేసీఆర్ క్యాబినెట్లో ఎనిమిది మంది మంత్రులు 2014 తరువాత ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారే అవడం మరో విశేషం.

గులాబీ పార్టీపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నీతి నిజాయితీకి భారత్ రాష్ట్ర సమితి నిలువుటద్దం అయినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు రామ్మోహన్ రెడ్డి. గులాబీ పార్టీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. 2014లో ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ఆయా పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ గులాబీ పార్టీ లోకి చేర్చుకున్న సంగతి మరచిపోయారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు తెరమీదకు వచ్చింది. తెలుగు దేశం పార్టీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఏకంగా క్యాబినెట్లోకి తీసుకుని కేసీఆర్ సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో తలసానిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తప్పు పట్టారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులకు స్థానం లేదన్నారు. అయితే వీరి మాటలను అప్పట్లో కేసీఆర్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. రాజకీయాల్లో ఫిరాయింపులు మామూలేనని కరాఖండీగా చెప్పారు. తాము స్వచ్ఛంద సంస్థను నడపడం లేదన్నారు. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నామంటూ తమ చర్యలను సమర్ధిం చుకుంటూ పేర్కొన్నారు.

  రాజకీయాల్లో అక్కడక్కడా ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు పార్టీ మారడం సహజం. అయితే కేసీఆర్ హయాంలో ఒకరో …ఇద్దరో కాదు…ఏకంగా ప్రతిపక్షాలకు చెందిన శాసనసభా పక్షమే అధికార పార్టీలో విలీన మైంది. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేవే. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో. …ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. అయితే ఈ విషయంలో కేసీఆర్ తీరు భిన్నంగా ఉండేది. తెలంగాణలో అసలు ప్రతిపక్షం అనేదే ఉండకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈ నేపథ్యంలోనే బహిరంగంగా, నిర్లజ్జగా ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి వలసలను ఆ పార్టీ పెద్దలు తప్పు పెట్టడం ఎంతవరకు సమంజ సమని కాంగ్రెస్ నాయకులు నిలదీసి ప్రశ్నిస్తున్నారు. వలసలను తప్పుపట్టే నైతికత గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేవని తెగేసి చెబుతున్నారు. ఏమైనా గులాబీ పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి వలసబాట పట్టారు. అయితే ప్రస్తుత గులాబీ పార్టీ పరిస్థితిపై తెలంగాణ సమాజంలో ఎవరికీ సానుభూతి కనిపించడం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నారు మేధావులు, ప్రజా సంఘాల నేతలు.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కేసీఆర్‌తో రాజయ్య భేటీ తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ తో భేటీ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. పార్టీ కీలక నేతలతో కలసి కెసీఆర్‌ని కలిసారు. దీంతో స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్