స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అధికార వైసీపీని మరోసారి నిగ్గదీసి ప్రశ్నించారు టీడీపీ యువనేత నారా లోకేష్. పుట్టినరోజు నాడే ఒక వెటనరీ డాక్టర్‌ని కారుతో ఆక్సిడెంట్ చేసి చంపేసి.. అక్కడినుండి చెక్కేసిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పోలీసులూ? అంటూ ప్రశ్నించారు. వైసీపీలో అందరూ హంతకులే ఉన్నారా? అంటూ నిలదీసి అడిగారు. వైసీపీ అధినేత జగన్.. బాబాయ్‌ని హత్యచేసి మాపై తోసేశారు. అటు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ని చంపేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు. వైసీపీ ఎంపీ రీల్ స్టార్ భరత్ ఏమో.. వెటనరీ డాక్టర్ ని చంపేసి పరారయ్యారు. అసలు మీరు మనుషులేనా.. మీకు మానవత్వం ఉందా? అంటూ మండిపడ్డారు. జనాల్ని చంపడానికే రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.