స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను(Ration Card) అందిస్తోందందటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో(Socila Media) గ్రూపుల్లో వార్తలు వచ్చాయి. ఆగస్టు 21 నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం కానుందంటూ పోస్టర్ చక్కర్లు కొట్టింది. ఇప్పటికే రేషన్ కార్డు లేనివారు లేదా పాత రేషన్ కార్డులో పేరు లేదా అడ్రస్ తప్పుగా ఉంటే.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పోస్టర్ లో పేర్కొన్నారు.
నూతన రేషన్ కార్డుల జారీపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula kamalakar) స్పష్టం చేశారు. అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పారు. ఆ వార్తలను నమ్మొదని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఏ విధమైన రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు కాలేదని స్పష్టం చేశారు. అదంతా ఫేక్(Fake) ప్రచారమని దానికి ఎవరూ నమ్మవద్దని ప్రకటించారు. తప్పుడు పోస్టులను ఎవరూ షేర్ చేయవద్దని సూచించారు. ప్రజలను అయోమయానికి గురిచేసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు.