స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీ పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి విడుదల చేశారు. ఫలితాల్లో 86.35శాతం మంది ఉత్తీర్ణత సాధించారని… 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈనెల 10వ తేది జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,60,329 మంది దరఖాస్తు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


