ఏపీ మంత్రి రాంప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులను చంపినా ఒక్కటే, కుక్కని చంపినా ఒక్కటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. పేదలకు సెంటున్నర భూమి ఇవ్వని పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో మాత్రం 10 వేల ఎకరాలు కాజేసిందని సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో జగన్ బూట్లకు లేసులు వేసిన వ్యక్తి మిథున్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగిరెద్దుల్లా తల ఊపుతూ తిరిగే జగన్ కేబినెట్ మంత్రుల్లా తాము పని చేయమని, సీఎం చంద్రబాబు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సొమ్ము తిన్న నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ హెచ్చరించారు.


