వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారన్న వైసీపీ చేసిన ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబుకు ఏ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారో, ఇప్పుడదే కారును జగన్ కు ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు పాత వాహనం ఇచ్చింది గత వైసీపీ ప్రభుత్వమేనని… ఇప్పుడదే వాహనాన్ని జగన్‌కు ఇస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నావు అంటూ మండిపడ్డారు. కేవలం ఒక మాజీ సీఎంగా ఉన్నందున జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని, టాటా సఫారీ వాహనం ఇచ్చారని తెగ బాధపడిపోయారని సెటైర్లు వేశారు.


