స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు బెయిల్ లభించింది. భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర నంద్యాలలోకి ప్రవేశించిన సందర్భంగా మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై భూమా వర్గీయులు దాడి చేశారు. ఈ కేసులో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అఖిలప్రియకు కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.