ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సాగర్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో జన సేన సాధించిన ఘన విజయం తెలంగాణలోనూ ప్రభావం చూపుతోం దని అన్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపే తం చేసేందుకు తమ అధినేత పవన్ కల్యాణ్ సన్నా హాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఎంతోమంది నేతలు ఇప్పటికే జనసేనలో చేరేందుకు ముందుకొస్తున్నారని తెలియజేశారు.