వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు 38 శాతం ఓట్లు వచ్చినా.. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు.. మాకు తేడా లేదన్నారు. ఆడలేక మద్దెల ఓటు అన్నట్లుంది జగన్ తీరు అని అంటూ ట్వీట్ చేశారు. బడ్జెట్ బాగోలేదని… రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారని విమర్శించారు. 38శాతం ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి పోనీ వైసీపీని ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చింది జగన్ మోహన్‌రెడ్డియేనని తెలిపారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అని అంటూ విమర్శలు గుప్పించారు.. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయాలని ట్వీట్ చేశారు.