ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతులు వీడాలని స్పష్టం గా చెప్పారు. సీఎంను ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని చంద్రబాబు చెప్పారు. దీంతో కట్టిన పరదాలను తొలగించారు.