స్వతంత్ర వెబ్ డెస్క్: గృహనిర్మాణాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. రూఫ్ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.. ఈ అర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు అధికారులు. అయితే, కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
మరోవైపు టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.. ఇప్పటివరకూ 71,452 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది ప్రభుత్వం. ఈనెలలో మరో 29,496 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు సిద్ధం అయ్యింది. ఆగస్టులో 49,604 ఇళ్లు ఇస్తామన్న అధికారులు. 300 చదరపు అడుగులు ప్లాట్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2వేల కోట్లు రుణాలుగా ఇప్పించామని తెలిపారు.. అయితే, టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని సీఎం ఆదేశించారు.. దీనికి సంబంధించి వివిధ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. వందల, వేల సంఖ్యలో గృహాలు ఈ కాలనీల్లో ఉంటున్నందున వారి అవసరాలను తీర్చేలా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.