ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ గుజరాత్‌లో పర్యటించబోతున్నారు. గాంధీనగర్‌లో రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ – 2024 లో పాల్గొనబోతున్నారు. ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. తొలి రోజే చంద్రబాబు ప్రసంగిస్తారు. ఏపీలో అమలు చేయనున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ఆయన వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చంద్రబాబు చర్చిస్తారు. ఇక్కడున్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించి ఆహ్వానించనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.