మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. తల్లి, చెల్లిపై అసభ్యంగా దూషించినా పట్టించుకోలేదన్నారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడడలేదని సీఎం అన్నారు. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహుల కోసం రెండు చట్టాలు తెస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అసత్యాలను జగన్ పదేపదే చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు చేశారని విమర్శలు గుప్పించారు. గతంలో వ్యవస్థలు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఏపీలోనే ఉండేవని అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే టీడీపీ ఆఫీసుపైనే దాడికి తెగబడ్డారన్నారు. గతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లోనే గంజాయి, డ్రగ్స్ దొరికేవని సీఎం ఆరోపించారు. జగన్ తన సొంత తల్లి, చెల్లిని అసభ్యంగా దూషించినా పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. షర్మిలపై వర్రా రవీంద్రారెడ్డి చేసిన పోస్టుల గురించి తన నోటితో తాను చెప్పలేనని అన్నారు. అసెంబ్లీలో ప్రస్తావించడానికి వీల్లేకుండా వర్రా పోస్టులు పెట్టాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్రా పేరుతో వేరే వాళ్లు పోస్టులు పెట్టారని జగన్ అంటున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పైనా అసభ్యకర పోస్టులు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు చంద్రబాబు. దాంట్లో వైసీపీ వారినే ఉద్యోగులుగా నియమించారని సీఎం ఆరోపించారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చేత అసభ్యకర పోస్టులు పెట్టించారని విమర్శించారు. భవిష్యత్‌లో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తన జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో పోరాడనని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు జగన్ లాంటి వ్యక్తిని మాత్రం చూడలేదన్నారు. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహుల కోసం రెండు చట్టాలు తెస్తున్నామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కఠిన చట్టాలు తెస్తున్నామన్నారు. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలన్నారు.
మరోవైపు బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా జగన్‌పై కీలక కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్‌పై చార్జిషీట్ వేశారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎంను బీజేపీ ఎమ్మెల్యే కోరారు. గత పాలనపై శాసనసభ సాక్షిగా సీఎం తీవ్ర ఆరోపణ చేశారు. జగన్ హయాంలో ఏపీలో అన్న వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కఠిన చట్టాలు తెస్తున్నామన్నారు. ఇక విష్టుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.