స్వతంత్ర వెబ్ డెస్క్: ఓటర్ల జాబితా విషయమై ఏపీలో అవకతవకలు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఆరోపించారు. సోమవారం ఓటరు అవగాహనపై బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ… ఓటర్ల జాబితాలో అవకతవకలు గతంలోనూ ఇప్పుడూ జరుగుతున్నాయన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
ఉరవకొండలో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల (MLA Payyavula Kesav) ఇచ్చిన ఫిర్యాదుతో సస్పెన్షన్ చేశారని తెలిపారు. ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం స్థానికంగా కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితాలో చేరికలు.. తీసివేతలు జరుగుతున్నాయన్నారు. వాలంటీర్లు పంపిన సమాచారాన్ని క్రోడికరించి అవకతవకలకు పాల్పడేందుకు హైదరాబాదులో ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారని తెలిపారు. ఇలాంటి వాటి విషయంలో బీజేపీ సీరియస్‌గా వ్యవహరిస్తుందని పురందేశ్వరి పేర్కొన్నారు.