స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. రేపు ఉదయం 11గంటలకు విజయవాడలోని తన కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఇవాళ లేదా మే 7వ తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు. ఫలితాలు విడుదలైన అనంతరం విద్యార్థులు https://bse.ap.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.