ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసు ఉన్నతాధికారులకు భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు IPS అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముంబై హీరోయిన్ జెత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అధికారులతో పాటు ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, న్యాయవాది వెంకటేశ్వర్లుకు కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది.
ముంబై నటి జెత్వాని వేధింపుల కేసులో ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు ఉన్నతాధికారులకు బెయిల్ మంజూరయింది. న్యాయస్థానం షరతులలో బెయిల్‌ను ఆమోదించింది. దర్యాప్తుకు సహకరించాలని షరతు విధించింది.
కాగా, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది.