26.7 C
Hyderabad
Sunday, June 16, 2024
spot_img

పశ్చిమాసియాలో మరో యుద్ధం?

      పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు ఉరుముతున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమ న్నాయి. గాజా సంఘర్షణను పెద్ద యుద్ధంగా విస్తరించడానికి ఇజ్రాయెల్ పశ్చిమాసి యాలో ఆజ్యం పోస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్య క్షుడు జోబైడెన్‌ తాజాగా ప్రకటించారు. అమెరికా, దాని మిత్రపక్షాలు ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగితే, ఇది పశ్చిమాసియాలో ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్న ఆందోళన వ్యక్తమ వుతోంది. గాజాలో మారణహోమం ఇంకా చల్లారకముందే.. పశ్చిమాసియాలో మరో యుద్ధం తప్పదా?

    ఏప్రిల్ నెలారంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, పలువురు సైనికాధికారుల మృతితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత హెచ్చాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ను శిక్షి స్తామని ఇరాన్ ప్రకటనతో ఇజ్రాయెల్ విస్తృత యుద్ధానికి సంసిద్ధమైపోయింది. ముందుగా హెచ్చరించినట్లు గానే ఇరాన్ 300 పైగా డ్రోన్ లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడితే.. ఇజ్రాయెల్, అమెరికా దళాలు చాలావరకూ ఆ క్షిప ణులు, డ్రోన్లనుమధ్యలోనే ధ్వంసం చేశాయి. సైరన్ ల మోతతో, ఆకాశంలో పేలుళ్లతో జెరూసలేం వీధులు దద్దరి ల్లాయి. ఇజ్రాయిల్ డ్రోన్లను, క్షిపణులను ఎక్కడి కక్కడే నిరోధించారు. దాడుల్లో 12 మంది గాయపడ్డారని, ఒకరు చనిపోయారని వార్తలు వెలువడ్డాయి. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్‌ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇరాన్ వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిం చింది. వాటిలో 70 శాతానికి పైగా డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు.

   ఇజ్రాయెల్ లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. టెల్ అవివ్ లోని ప్రధాని నివాసం ఎదుట ఇజ్రాయెలీలు నెతన్యాహు యుద్ధోన్మాదాన్ని నిరసించారు. వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హమాస్ చేతిలో బందీల విడుదల విషయంలో నెతన్యాహు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు తప్పించు కునే కుట్రలో భాగం గానే, నెతన్యాహు పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత విస్తరించేందుకే సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేయడాన్ని ఇజ్రాయెలీలు నిరసిస్తున్నారు.

   నెతన్యాహు, ఇజ్రాయెల్ వ్యూహం స్పష్టంగా ఉంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో సుమారు 400 మంది భద్రతా సిబ్బంది సహా 1,200 మంది ఇజ్రాయెలీల మరణం, 250 మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకోవడంతో గాజాలో మారణ హోమం సృష్టించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి.. పాలస్తీనా జాతినే తుడిచి పెట్టేలా కొనసాగింది. దీంతో 34 వేల మందికి పైగా పాలస్తీనియన్లు బల య్యారు. గాజాలోని నగరాలు, పట్టణాలు నేలమట్ట మైపోయాయి. ఆఖరికి గాజాకు నీళ్లు, ఆహారం, మందులు అందకుండా ఇజ్రాయల్ నియంత్రించడంతో పాలస్తీని యన్లు కుదేలయ్యారు. ఇంత జరుగు తున్నా.. అమెరికా, పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ కు వత్తాసు ఇస్తూనే ఉన్నాయి. కాల్పుల విరమణకు పదే పదే ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి పిలుపునిచ్చినా, ఇజ్రాయెల్ మారణ హోమం ఆగలేదు.

   ఇజ్రాయెల్ జైళ్లలో ఏళ్లుగా మగ్గుతున్న పాలస్తీనియన్లను విడిపించేందుకే.. హమాస్ 240 మంది ఇజ్రాయెలీలను బందీ లుగా పట్టుకుని గాజాకు తరలించింది. ఈ ఆరు నెలల్లో ఇజ్రాయెల్ కొన్ని వందల మంది ఖైదీలను విడుదలచేస్తే, హమాస్ పలువురు బందీలను విడుదల చేసింది. గాజాలో బతకలేక దక్షిణప్రాంతంలోని రఫాలో శరణార్థి శిబిరాలకు చేరిన 17 లక్షలమంది పాలస్తీనియన్లపైనా ఇజ్రాయెల్ దాడులు జరపడం పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

     లెబనాన్ లో ఇరాన్ మద్దతుదారులుగా భావిస్తున్న హిజ్బుల్లాలను రెచ్చగొడుతూ, ఇజ్రాయెల్ అడపా దడపా దాడులు చేసినా.. అది పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయలేదు. అందుకే ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్, బీరూట్ ను టార్గెట్ చేసింది. ఇరాన్, హిజ్బుల్, యెమన్ తోపాటు తమపై దాడి చేసే అవకాశం ఉన్న అన్నివర్గాలను టార్గెట్ చేసింది. సిరియాలోని లక్ష్యాలపై బాంబుదాడులు చేసింది. ఇరాన్ ప్రతీకార దాడులు ఆరంభించడంతో ఉద్రిక్తతలు హెచ్చాయి. ఇరాన్ దూకుడుగా హర్మూజ్ జలసంధి దగ్గర ఇజ్రాయెల్ వాణిజ్యవేత్తకు చెందిన వాణిజ్యనౌక ను హెలికాప్టర్లతో దాడి చేసి మరీ తమ అదుపులోకి తెచ్చుకుంది. దీంతో.. ఆ నౌకను విడిపించేందుకు అమెరికా యుద్ధనౌకలు.. సన్న ద్ధమవుతున్నాయి.ఇరాన్ దురాక్రమణ విషయంలో ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటిం చింది, ఇరాన్ వెనక్కి తగ్గాలని, టెహ్రాన్ యుద్ధం మానుకోవాలని పిలుపునిచ్చింది. ఇరాన్ వెనక్కి తగ్గు తుందా.. దాడులు కొనసా గుతాయా. ఇరాన్ ఇతర అరబ్ దేశాలు మద్దతు ఇస్తాయా.. ఇరాన్ – ఇజ్రాయిల్ ఈ పరస్పరం దాడులు ఏ పరిణామా లకు దారితీస్తాయో చూడాలి.

Latest Articles

నవ్విస్తూ, భయపెట్టిన OMG (ఓ మంచి ఘోస్ట్) ట్రైలర్

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్