స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని సూచించింది. భానుడి ప్రతాపానికి ఏపీలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. వేడి గాలుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, మధ్యాహ్న సమయంలో అధికంగా ఎండలు కొట్టడంతో ఎవరూ బటయకు రావద్దని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మే నెల పూర్తి అయ్యేంత వరకు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది.