స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరో విషాదం నెలకొంది. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. బాలుడు మృతితో కుటుంబీకులు, బంధువులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. దీంతో ఆయింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవలే హైదరాబాద్‌లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతి చెందింది.ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.