కేంద్ర మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్‌నే మకాం వేశారు ఢిల్లీ పోలీసులు. నిన్నటి నుండి హైదరాబాద్‌లోనే ఉంది ఢిల్లీ పోలీసుల బృందం. ఇవాళ మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న వారిని అరెస్ట్ చేసే యోచనలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాత్రంతా విచారించారు.


