32.7 C
Hyderabad
Wednesday, May 29, 2024
spot_img

హైదరాబాద్ కు మరో ఎంఎంటీఎస్ సర్వీస్

         హైదరాబాద్ ప్రజలకు మరో ఎంఎంటీఎస్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఎంఎంటీఎస్ సెకెండ్ ఫేజ్ లో భాగంగా పూర్తి అయిన ఘట్కేసర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్ సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సర్వీస్ తో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే వెసులుబాటు ఉందని , శివారు ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వెళ్లే ఐటీ ఉద్యోగులకు ఈ సర్వీస్ ను ఉపయోగిం చుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది. రోజుకు రెండు సర్వీసులతో నడిచే ఘట్కేసర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్ టైమింగ్స్ షెడ్యుల్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

     హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపేలా 2013లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎట్టకేలకు పూర్తైంది. 817 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాయి. మొత్తం 6 మార్గాలలో కనెక్టివిటీ కోసం మొదలైన ఈ ప్రాజెక్టు 11 ఏళ్ల తర్వాత కంప్లీట్ అయింది. ఈ ఆరు మార్గాలలో నాలుగు ఇప్పటికే పూర్తి కాగా.. తాజాగా మౌలాలి – సనత్ నగర్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో ఘట్కేసర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్ లైన్ క్లియర్ అయింది. మంగ ళవారం నుంచి ఉదయం సాయంత్రం సమయాల్లో ఘట్కేసర్ – లింగంపల్లి మధ్య రెండు సర్వీసులు నడుస్తా యని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఉదయం 7:20 నిమిషాలకు ఘట్కేసర్ – లింగంపల్లి , సాయంత్రం 5:45 నిమిషా లకు లింగంపల్లి – ఘట్కేసర్ కు ఎంఎంటీఎస్ ట్రైన్ నడవనుంది. సనత్ నగర్ – మౌలాలి ఎలక్ట్రిఫికేషన్ , డబుల్ లైన్ పూర్తి అవడంతో ప్యాసింజర్ రైళ్లు కూడా నడుస్తాయని.. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఒత్తిడి తగ్గుతుం దని రైల్వే అధికారులు అంటున్నారు. అలాగే ఘట్కేసర్ నుంచి లింగంపల్లికి ఒక గంట 55 నిమిషాల్లో చేరుకోవచ్చని చెబుతున్నారు.

    గత ఏడాది ఫలక్ నుమా – ఉందా నగర్, సికింద్రాబాద్ – మేడ్చల్ , తెల్లాపూర్ – రామచంద్రాపురం సర్వీసులను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే సమయానికి రైళ్లు రాకపోవడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటూ తరచూ రైళ్లను రద్దు చేయడంతో ఎంఎంటీఎస్‌కి ఆదరణ తగ్గుతోంది. కొత్త సర్వీసులను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే సరైన నిర్వహణ చేయడంలో విఫలమైందని సీపీఐ నాయకులు శ్రీనివాస్ విమర్శించారు. ప్రారంభించే దాని మీద ఉన్న చిత్త శుద్ది వాటిని నిర్వహించడంపై కూడా పెట్టాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నగర జనాభా కోటి పైగా దాటడంతో ట్రాన్స్‌పోర్టుకు డిమాండ్ పెరిగింది. అయితే కారణాలు ఏవైనా ప్రస్తుతం MMTS సర్వీసులకు ఆదరణ తగ్గుతోంది. కొత్త సర్వీసులను రైల్వే UTS యాప్‌లో పెట్టీ, లైవ్ ట్రాకింగ్, సమయ పాలన పాటిస్తే ప్రజల ఆదరణ పొందే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles

ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్‌ వార్నింగ్‌

     ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్‌ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్