స్వతంత్ర వెబ్ డెస్క్: అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నాఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఏఎన్నాఆర్ శతజయంత్రి ఉత్సవాలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నాగార్జున కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అల్లుఅరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, రామ్ చరణ్, మహేష్ బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, విష్ణు, నాని, దిల్ రాజ్, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.