తమిళనాడు సింగంగా పేరుగాంచిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తరఫున ప్రచారం చేయనున్నారు. జమ్మికుంటలోని శంకర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంట్ యువ సమ్మేళనంలో అన్నామలై పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కల్వకుర్తి సభలో పాల్గొంటారు. అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి తరుఫున సాయంత్రం సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొననన్నారు.


