25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

దేశాన్ని ప్రభావితం చేసే దిశగా అన్నా చెల్లెళ్ల రాజకీయాలు

    రాహుల్ గాంధీ….దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆశాదీపం ఆయన. వాస్తవానికి రాహుల్ గాంధీ ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. తండ్రి రాజీవ్ గాంధీ మరణం తరువాత తల్లి సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీకి దిక్కయ్యారు. అయితే సోనియా గాంధీకి వయసు మీద పడటంతో ఆమె ఒత్తిడి మేరకు రాహుల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. అయితే రాహుల్ రాజకీయాల్లోకి రావడం వెనుక సోదరి ప్రియాంక ప్రమేయం కూడా ఉందంటారు రాజకీయ విశ్లేషకులు.

   2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తరువాత రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతగా కోరినప్పటికీ రాహుల్ ససేమిరా అన్నారు. ఆ తరువాత రాహుల్ పొలిటికల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాలు ఏమీ లేవు. రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్రను సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పువాలి. 2022 సెప్టెంబరు ఏడో తేదీన రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్‌ పాదయాత్ర సాగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర నడిచింది. భారత్ జోడో యాత్రలో వివిధ వర్గాల ప్రజలు రాహుల్‌తో పాటు నడిచారు.

    భారత్ జోడో యాత్రలో అన్న రాహుల్ వెంట చెల్లెలు ప్రియాంక నడిచారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సాగుతున్న ప్పుడు రాహుల్ వెంట సోదరి ప్రియాంక కూడా అడుగులో అడుగేసి నడిచారు. రాహుల్‌కు అండగా నిలిచారు. ఒక్కో రాష్ట్రం దాటుతున్న కొద్దీ భారత్ జోడో యాత్రకు సామాన్య జనంలో ఆదరణ పెరిగింది. రాహుల్ గాంధీ చుట్టూ యువకులు, మహిళలు, పిల్లలు. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే సన్నివేశం కనిపించింది. ఏ రాష్ట్రానికి వెళ్లినా స్థానిక నాయకులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆయా ప్రాంత సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అలాగే రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి యువతతో బాగా కనెక్ట్ అయ్యారు.ఈ జనరేషన్ చెప్పేది శ్రద్ధగా ఆలకించారు. భవిష్యత్ భారత్ ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే భారత్ జోడోయాత్ర వెనుక ప్రియాంక గాంధీ ఉన్నారని హస్తిన రాజకీయవర్గాలు పేర్కొన్నాయి. జోడో యాత్ర సందర్భంగా ఇంటరాక్ట్ అయ్యే వివిధ వ్యక్తులతో ఎలా మెలగాలో , యువతతో ఎలా మాట్లాడాలో రాహుల్ గాంధీకి ప్రియాంక ముందుగా బ్రీఫింగ్ ఇచ్చారని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బందుల్లో ఉందనగానే రాహుల్ సోదరి ప్రియాంక రాజకీయరంగ ప్రవేశం చేశారు. అన్న రాహుల్‌ గాంధీకి అండగా నిలిచారు. వాస్తవానికి 1989 లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి రాజీవ్‌ గాంధీ తరఫున అమేథీ నియోజకవర్గంలో ప్రియాంక ప్రచారం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై ప్రియాంక దృష్టి పెట్టారు.

   ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైనప్పటికీ ప్రియాంక గాంధీకి జనాదరణ ఉన్న విషయం వెల్లడైంది. నాయనమ్మ ఇందిర పోలికలు ప్రియాంకలో బాగా కనిపిస్తాయి. దీంతో దేశ ప్రజలకు ప్రియాంక గాంధీ కనెక్ట్ అయ్యారు. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమించారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అప్పటి బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కన్నడవాసులను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడంలో ప్రియాంక విశేష కృషి చేశారు. ఆ తరువాత మూడు నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో సోదరుడు రాహుల్‌ గాంధీతో కలిసి వరుసగా రోడ్‌ షోలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. అంతిమంగా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

   కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు కూడా సోదరుడు రాహుల్ గాంధీకి ప్రియాంక అనేక సలహాలు ఇస్తుంటారని హస్తిన రాజకీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ప్రియాంక ఇచ్చే సలహాలు, సూచనలకు రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇస్తారని పొలిటికల్ పండిట్లు చెబుతుంటారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు తరముకువస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున దేశమంతా ప్రచారం చేయడానికి ప్రియాంక గాంధీ సన్నద్ధమవు తున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్ల ప్రచారం చేయడానికి ప్రియాంక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో వయనాడ్‌లో సోదరుడి కోసం ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయం టున్నారు రాజకీయ పరిశీలకులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్