23 C
Hyderabad
Tuesday, September 30, 2025
spot_img

పాకిస్తాన్ వెళ్లి మతం మారిన అంజుకి బహుమతుల వెల్లువ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రాజస్థాన్ కు చెందిన అంజు అనే వివాహిత పాకిస్థాన్ కు చెందిన 29 ఏళ్ల యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈమె వ్యవహారంపై తాజాగా అంజు తండ్రి థామస్ స్పందించి నా కూతురికి, మాకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆమె భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లినప్పుడే అన్ని సంబంధాలు తెగిపోయానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యాపారవేత్త మీడియా ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడను ఏం చెప్పాడు? అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్ అల్వార్ జిల్లా భివాడిలో అంజు (34)-అరవింద్ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. అలా కొంత కాలం పాటు వీరి కాపురం సంతోషంగానే కొనసాగింది. అయితే అంజుకు నాలుగేళ్ల కిందట ఫేస్ బుక్ ద్వారా పాకిస్థాన్ కు చెందిన నస్సుల్లా (29) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా వీరి ఆన్ లైన్ ప్రేమాయణం కొన్నాళ్ల పాటు గడిచింది. దీంతో అంజు ఎలాగైన పాకిస్థాన్ వెళ్లి ప్రియుడిని కలవాలని అనుకుంది. ఇందులో భాగంగా అంజు ఇటీవల అధికారిక వీసాతో భర్త, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పాకిస్థాన్ కు వెళ్లింది. ఆ తర్వాత అక్కడ తన ప్రియుడిని కలుసుకుంది. ఇంతే కాకుండా ఆ మహిళ ఇస్లాంలోకి మారిపోయి గత మంగళవారం స్థానిక కోర్టులో వివాహం కూడా చేసుకున్నారు. ఇదే సమయంలో పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ మొహ్సిన్ ఖాన్ అబ్బాసీ ఆ మహిళను అభినందించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తన భారతీయ మహిళ అయిన అంజు భర్త అరవింద్ కుమార్‌ను అల్వార్‌లో విడిచిపెట్టి పెళ్లి పాకిస్థాన్ కు చెందిన ప్రియుడిని చేసుకున్న అంజుకు పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ మొహ్సిన్ ఖాన్ అబ్బాసీ 10 మార్లా ఇళ్ల స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. అంజూ, ఇప్పుడు ఫాతిమా, పాకిస్థాన్‌లో ఉన్న అనుభూతిని కలిగించేందుకే ఈ బహుమతులు అని ఎవరు చెప్పారు. అంజు భారతదేశం నుండి ఇక్కడకు వచ్చి ఇస్లాం మతంలోకి మారారు. కాబట్టి ఈ బహుమతులు ఆమెకు స్వాగతం పలకడానికి ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము.

ఆమెను అభినందించేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే అని ఆయన అన్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ క్రమంలోనే అంజు తండ్రి థామస్ కూతురు చేసిన పనిపై స్పందించారు. ఎంతో గొప్పదైన భారతదేశానికి నా కూతురు చేసిన పని వల్ల కలంకం సోకినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నా కూతురు ఎప్పుడైతే భారత్ వదిలి పాకిస్థాన్ వెళ్లిపోయిందో..అప్పుడే మాకు ఆమెతో ఉన్న సంబంధాలు తెగిపోయాయని అన్నారు. అంజు తండ్రిగా ప్రభుత్వ రికార్డులో ఉన్న నా పేరును తొలగించాలని కూడా ఆయన కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్