తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో హుండీని పగులగొట్టిన దుండగులు నగదును ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున దుండగులు అనుమానంగా సంచరిస్తుండడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వద్ద నుంచి 31వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిపై సుమారు 10కేసులు ఉన్నాయని.. ప్రత్యేకంగా ఆలయాల్లో హుండీలను మాత్రమే దొంగలిస్తారని దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.