Amaravati Case |ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. రాజధాని అమరావతిని నిర్ణీత గడువులోపు అభివృద్ధి చేయాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ అమరావతి రైతులు సైతం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈరెండింటిని జస్టిస్ కె. ఎం. జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.
సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు(Amaravati Case) విచారణపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పునిస్తుందా.. లేదా ఈ కేసు విచారణను వాయిదా వేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసు విచారణను త్వరగా చేపట్టాలని ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని ఉంటుందని.. తన పాలన విశాఖకు షిఫ్ట్ చేస్తానంటూ ఇప్పిటికే ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖ్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..