స్వతంత్ర, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తిలో ఈనెల 10వ తేదీన బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎంపీ సి.ఎం.రమేష్ తెలిపారు. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయి.. జరుగుతున్నాయన్న మంత్రి.. వైసిపి అవినీతి, అక్రమాలను సభల ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. అభివృద్ధిలో ఎపి 30యేళ్ళు వెనక్కి వెళ్ళిందని మండిపడ్డారు. పుట్టిన ప్రతిబిడ్డపై రెండు లక్షల అప్పు తెచ్చిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ప్రతి పనిలోను అవినీతి, ప్రతి కంపెనీకి వైసిపి కార్యకర్తలే యజమానులగా ఉన్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని.. అందుకోసమే జనసేనతో కలిసే ముందుకు వెళతామన్నారు.