జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు.