సొంతింటిని కబ్జా నుంచి తిరిగి దక్కించుకోడాకికి ప్రాణం ఉన్నంతవరకు పోరాడి ఓడింది ఓ వృద్ధు రాలు. బైకుతో ఢీకొట్టి ఆమె మృతికి కిరాయిదారులే కారణమని ఆరోపించారు మృతురాలి కుమార్తెలు. కొండాపూర్‌కు చెందిన సూరం రమణమ్మ అమీర్‌పేట్ వెస్ట్ శ్రీనివాసకాలనీలోని జీ ప్లస్ 5 భవ నాన్ని లేడీస్ హాస్టల్ కోసం రమాతులసి అద్దెకు తీసుకుంది. అద్దె చెల్లించకుండా, బిల్డింగ్ ఖాళీ చేయకుండా సిటీ సివిల్ కోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకుంది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లున్న రమణమ్మను బైక్‌తో ఢీకొట్టించారని ఆమె కుమార్తెలు ఆరోపించారు. రమణమ్మ మృతదేహాన్ని ఇంటికి రానివ్వకుండా అద్దెదారులు అడ్డుకోవడం కొసమెరుపు.